Tuesday, December 23, 2008

మరో సారి మోసం?? మల్లి అదే ద్రోహం???



కే.సి.అరే తెలంగాణా, తెలంగాణాయే కే.సి.ఆర్ అనే నినాదంలో అతిశయోక్తి వుందేమో కాని, ఉప ఎన్నికల్లో బంగపడ్డ, గాయపడ్డ కే.సి.ఆర్. తోరలోనే, తెరుకోగాలిగాడు, ఎప్పటి మాదిరి గ పొత్తుల చక్రం తిప్పుతున్నాడు, కాని గాయ పడ్డ తెలంగాణా వుద్యమానికి కట్టు కట్టి వైద్యం చేసే వైద్యులు కాని, పరమార్శించే ఆప్తులు కాని లేక, తెలంగాణా వాదం అనాథ వలె, అశక్తురాలు వలె మిగిలి పోయింది..తెలంగాణా లక్ష్య సాధన ఏ దశలో వున్నదో, ఎంత కాలం పడుతుందో అని తేల్చుకొని పరిస్థితిలో సతమతమవుతున్నారు తెలంగాణా తల్లి బిడ్డలు. అధిష్టానం చేసే ఎత్తుగడలు ఒక వైపు, మిశ్రమ రాజకీయాల మధ్య తెలంగాణా వాదం నలిగి పోతున్నది.. వీళ్ళా మా అన్యాయాలను చక్కదిద్దే నేతలు, అని కుమిలి పోవటం తప్ప తెలంగాణా ప్రజలకు దిక్కుతోచటం లేదు.. ఏది జరగకుడదని తెలంగాణా ప్రజలు అనుకున్నారో అదే జరిగిందా? మల్లి మరొక సారి మోసంజరిగిందా? ప్రత్యేక రాష్ట్ర నినాదం తో ముందుకు వచ్చే నేతల చిత్తశుద్ది పై అనుమానాలు నిజం అయ్యాయ? న్యాయం జరగాలని అభివృద్ది ఫలాలు తమకే దక్కాలని తెలంగాణా ప్రజలు కట్టుకున్న చీమల పుట్టల్లో పాములు ప్రవేశించాయ? ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర వాదనతో ఆశలు నింపిన తెలంగాణా రాష్ట్ర సమితి చేసినది అపకరమో, వుపకారమో? మరి. తెలంగాణా సమస్యని జాతీయ స్థాయిలో ప్రచారం ఇచ్చి, గుర్తింపుని తెచ్చింది టి.ఆర్.ఎస్సే. నాయకత్వ లేమిని చెన్నారెడ్డి తర్వాత నింపింది టి.ఆర్.ఎస్సే. ప్రజల ఆశల నిచ్చెన మీద అవలీలగా అదికార అన్దేలాలకేక్కింది ఈ పార్టీయే. గతం లో కంటే భిన్నమైన పటిష్టమైన తెలంగాణా రాజకీయ సంస్థను నిర్మించినందుకు టి.ఆర్.ఎస్. ను అబినందిచలిసిందే.. "ఆశల శికారం నుంచి జారిపదినప్పుడు తెలంగాణకు తగిలిన గాయం మునుపటి కంటే పెద్దదే.. ఐతే, తెలంగాణా ఉద్యమం చేక్కుచేదర లేదని చాల మంది ఇంక విశ్వశిస్తున్నారు, నివురు గప్పిన నిప్పులాగో, తుపాను ముంది ప్రశాంతత లాగ ఉద్యమం వుందని ఆశబావలు వేక్తం చేస్తున్నారు. న్యాయం జరగాలన్న ఆకాంక్షను రాజకీయ పార్టి లో పెట్టి, నిరాయుదులుగా మిగిలి పోయారు తెలంగాణా జనం.. మరియు ఇప్పుడు జరగబోయే పరిణామాలకు ప్రేక్షక ప్రాయులుగ మిగిలిపోయారు.. అయిన కొంత వరకు తమ అసంతృప్తి ని తెలియజూపి, మొన్నటి ఉపఎన్నికల్లో టి.ఆర్.ఎస్ ని కొంచెం సమస్యల్లో పడేసింది, దానికి కొన్ని కారణాలు వున్నాయి.. అయిన ఆ పార్టి వైకరి లో ఆత్మ విమర్శ కనపించక పోవటం అభిమానులను కొంచెం క్రుంగ దీసింది, అందుకు, కొత్తగా ఏర్పడ్డ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు.. టి.ఆర్.ఎస్. నేతలను నిలదీయడానికి, తమ విమర్శలేమితో తెలియ చెప్పడానికి ప్రజలకు ఎటువంటి అవకాశాలూ అందుబాటు లో లేవు.. నామమాత్రపు కమిటీలు వున్నా చిన్న చిన్న కార్యకర్తలకు పెద్ద నాయకులను కలిసే మాట్లాడే యాన్త్రంగం లేకుండా పోయింది.. పార్టిని సరిదిద్దే మేధావులు, విద్యావంతులు, రాజకీయేతర సంస్థలు , ప్రస్తుతం ఎటువంటి మార్గం లేకుండా కుమిలి పోతున్నారు.. అయిన, తమ వంతు ప్రయత్నాలు, పాదయాత్ర లతో, ధూమ్ దాం కార్యకమలతో, రిలే నిరాహార దీక్షలతో, తెలంగాణా అవగాహనా కార్యక్రమాలతో, తెలంగాణా ప్రత్యేక రోజుల సంబరాలను, బతుకమ్మ సంబరాలతో, నవంబర్ ఒకటి విద్రోహ దినాల వురుగింపుతో ఈలంటివి కొన్ని చేస్తూ, వుధ్యమాని సజీవం గ వుండేట్టు చూస్తున్నారు.. ఇందుకు భిన్నం గ, తెలంగాణా వాదాన్ని ముందుకు తీసుక పోవటం, ప్రభుత్వ విధానాలతో తెలంగాణా ప్రయోజనాలను సాధించడం, తెలంగాణా కు హనికలిగే ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు అడ్డుకోవటం..ప్రాంతీయ పార్టీగా ప్రజా సమస్యలపై ప్రభుత్వం తో పోరాడటం లాంటివి చెయ్యలేదు.. సభలు నిర్వహించడం మొదటి నుండి అనుసరిస్తున్న ఉద్యమ రూపం.. తెలంగాణా మేధావులు రూపొందించిన వాదనలను చమత్కార శైలిలో మాట్లాడి చప్పట్లు కొట్టించుకోవటమే కాని, జన గర్జనలో, సింహ గర్జనలో ప్రజలకు ఇచ్చిన కార్యక్రమంలు లేవు.. బాల ప్రదర్శన అవసరమైనప్పుడల్లా సభలు ప్రకటించటం, సభలకు కూడా ప్రజలు తమ సొంత డబ్బులతోనే వస్తారు కాబట్టి, సబలకు అయ్యే కర్చు కూడా తక్కువే.. జనాబిమనాన్ని ఎప్పటికప్పుడు రాజకీయం ప్రయోజనాల కొరకు వాడుకోవటం తప్ప టి.ఆర్.ఎస్. నాయకత్వం ఏ ప్రజా సమస్య మీద ప్రత్యేకంగా సభలు ఆందోళన కార్యక్రమాలు చేపట్ట లేదు...పోలవరం ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులయ్యే ఖమ్మం గిరిజనుల సమస్య మీద సి.పి.ఐ , సి.పి.ఎం. పోరాడినాయి, తెలంగాణా సాగునీటి అవసరాలను, రాజదాని మంచి నీటి కేటాయిమ్పులను ప్రబితం చేసే పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు ఆశం మీద కాంగ్రెస్ నేతలు, తెలంగాణా ఇర్రిగాషన్ ప్రాజెక్టులను సకాలం లో పూర్తి చేయాలనీ తే.దే.ప. అంటుంటే, తెలంగాణా రాష్ట్ర సమితి మాత్రం, ఏమి పట్టనట్టు, రచ్చ గెలిస్తే చాలు అని, ఇంటిలోనే వోదిపోయే దుస్తితి ఏర్పడింది..అదే జరిగింది.. కూడా. టి.ఆర్.ఎస్. దొరని కాని, వైపల్యం కాని తెలంగాణా ప్రజలను ఇంతగా నిరాశపరచడానికి కారణం. ఎంతకాలం మోసపోవాలన్న ప్రశ్న టి.ఆర్.ఎస్. విషయం లో మల్లి ఎదురయ్యింది.. టి.ఆర్.ఎస్. వల్ల ఎదురయ్యే ప్రశ్న కొత్తగ కాకున్నా, గత యాబై సంవస్తరాలుగా తెలంగాణా నాయకత్వం ప్రజలతో దాగుడు మూతలు ఆడుతూ, తమ స్వార్థాన్ని మాత్రం నెరవేర్చుకుంది..
ఆకరికి - తెగించి పోరాడే సామర్ధ్యం కాని, రాజీలేని పోరాటం చేయగలిగిన చిత్త శుద్ధి కాని, ప్రలోభాలకు లొంగని,నిజాయితి గల్గిన లక్షణాలు వున్నా వెక్తులు తెలంగాణా కు ఎంతైనా అవసరం వుండి.. ఈలాంటి వెక్తులను పుట్టకుండా చేస్తున్నది తెలంగాణా ఆధిపత్య వర్గాలు..

1 comment:

TELANGANA said...

PRP లో NTP విలీనం తెలంగాణ మహోద్యమంలో మెగా మలినం! చాకలి ఐలమ్మ వీరత్వానికి వారసులమన్నారు! దొడ్డి కొంరయ్య దైర్యానికి ప్రతీకల మన్నారు !..ఆకలినైనా భరిస్తాం కాని అవమానాన్ని భరించమంటూ భాషనాలిచారు ! తెలంగాణ ఉద్యమాన్ని రెండో స్వతంత్ర పోరాటంగా మారుస్తామన్నారు ! వోట్ల చుట్టూ ఉద్యమాన్ని తిప్పబోమని మేదావుల సాక్షి గా మాయ మాటలు చెప్పారు ! పదవే పరమావది కాకపోతే పది నెళ్ళు కూడా నిండని పసిగుడ్డు పార్టీని పరాయికరిస్తారా ? " ప్రజా" ముసుగు లో ఇంత పచ్చి మోసమా ?నాడు తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్ లో విలీనం నేడు ప్రజా రాజ్యంలో నవ తెలంగాణ(ప్రజా) పార్టీ విలీనo..తెలంగాణ ఉద్యమం లో లీనం కాని నేతల నోటే వస్తుంది విలీనం మాట ! రేపు జనం కచ్చితంగా చూపిస్తారు ..వారికి నిమజ్జనం బాట