Tuesday, October 21, 2008

Andhra Pradhesh Formation day A Black day of Telangana


భారత దేశ స్వాతంత్రం అనంతరం, మద్రాస్ రాష్టంలో బాగంగా వున్నా ఆంధ్రులు (కోస్తంద్ర, రాయలసీమ), తమని ఉద్యోగ రంగం లో, వనరుల పంపినిలో తమిళులు దోపిడీకి గురి చేస్తున్నారని, పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణ త్యాగ పలితంగ 1953 అక్టోబర్ 1 న మద్రాస్ రాష్ట్రం లోనుండి ఆంధ్రులను విడదీసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. మద్రాస్ నగరం లో బాగం కావాలన్నా లక్షంతో దీక్ష్య చేసి, 1952 లో పొట్టి శ్రీరాములు చనిపోగా, విశాలాంద్ర (ఆంధ్ర ప్రదేశ్) ఏర్పాటు కొరకు ప్రాణత్యాగం చేసినట్లు నేటి నాయకులూ, మేధావులు వర్ణించడం చరిత్రను వక్రికరించడమే.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజదాని ఒక పెద్ద ప్రశ్న మిగిలి పోయి, తలసరి ఆదాయం లేక గడ్డు పరిస్థితుల్లో, ఆంధ్ర నాయకుల కన్ను హైదరాబాద్ రాష్ట్రం మీద పడి, బాష ప్రయుక్త రాష్ట్రాల పల్లవితో అందరిది తెలుగేనని తెలంగాణా ప్రజలు తమ వారేనని కపట ప్రేమ వొలక పోసి, తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న బూటకపు నినాదాన్ని తెచ్చారు. విశాలాంద్ర ఏర్పాటుకు తెలంగాణా ప్రజలు వెతికించిన అనంతరం, ఫజాల్ అలీ అద్వర్యం లో మొదటి SRC తాయారు చేయబడింది. మొదటి SRC ప్రకారం, వీలినం సబబు కాదని, హైదరాబాద్ రాష్ట్రం లోని 8 జిల్లాలను ప్రత్యేక రాష్ట్రం గ ఏర్పాటు చేయాలనీ సూచించింది. దీనికి ఆంధ్ర నాయకుల కేంద్రం లో తమ పలుకుబడిని ప్రయోగించి కేంద్రాన్ని సమ్మతింప జేసి, తెలంగాణా నాయకులను తమ హామీలతో, ప్రలోబలతో లొంగదీసి, పెద్ద మనుషుల వొప్పందం ద్వారా ఈ రోజు అనగా నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత, యాబై మూడు సంవత్సరాల నుండి, తెలంగాణా ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. వరుస ఆంధ్ర పాలన లో అనేకమైన ప్రణాలికలు, జి.వో. లు, అగ్రీమేంట్లు చేశారు, ఫార్ములాలు తెచ్చారు, ఒక్కటి కూడా, తెలంగాణా ప్రాంత ప్రజల అభివృద్దికి తోడ్పడక పొగ, తెలంగాణా ప్రాంతం ఎడారిగా మారింది. విశాలాంద్ర వుద్యమం లో తెలంగాణా రక్షణ ల గురించి మాట్లాడి, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత మాట మార్చిండ్రు. తెలంగాణా విషయం లో ఏ చట్టాన్ని, ఏ హామిని కాతరు చేయక, తెలంగాణా రక్షణలు చెత్త బుట్టలో వేసి, హిట్లర్ పాలన మొదలు పెట్టిండ్లు.
తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలను దొంగ సర్టిఫికెట్లు చూపి, ముల్కి నిబందలనకు వెతిరేకంగా కొట్టుక పోయారు..తెలంగాణా వనరులను ఆంధ్ర కు తరలించే ప్రయత్నాలు ఎడతెగకుండా సాగుతూనే వున్నాయి, దీనిని సహించలేక వుద్యోగులు, మేధావులు, విధ్యార్థులు తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర వుద్యమానికి నాంది పలికినారు. 1969 తెలంగాణా వుద్యమం లో ప్రపంచం లో కని విని ఎరుగని రీతిలో విచ్చల విడిగా అరెస్ట్ లు, కాల్పులు, పాఠశాలలను, కాలేజి లను, నిర్బంద ప్రదేశాలు గా మార్చారు.. భాషరాని పోలిసు సిబ్బంది తో తెలంగాణా ప్రజలను పొట్టన పెట్టుకున్నారు..
ఇప్పటికి యాబై మూడు ఏండ్లు నిండినాయి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడి, ఈ 5 దశాబ్దాల నుండి తెలంగాణా అబివృద్ది ఎక్కడినుండి ఎక్కడికి వచ్చింది, ప్రణాళికలు ఎంత వరకు సఫలం అయ్యాయి? పల్లెల అబివృద్ది ఏమి జరిగింది? ప్రభుత్వ భూములను అమ్ముకునే పరిస్థితి కి ప్రభుత్వం ఎందుకు దిగజారింది? తెలంగాణా రైతులే భూములను ఎందుకు అమ్ముకుంటున్నారు ? ఎందుకు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు? చేనేతకు ప్రసిద్ది కెక్కిన తెలంగాణా లోని సిరిసిల్ల గ్రామం లో ఆత్మ హత్యలు ఎందుకు అయ్యాయి? వీటిని మనం ఎందుకు ఆలోచించ లేకపోతున్నాం? ప్రభుత్వ భూముల అమ్మకాల ద్వారా వచ్చిన వేలాది కోట్లు ఆదాయంగ బావించాలా? అసలు ప్రబుత్వానికి భూములను అమ్మ వలసిన అవసరమేమీ వచ్చింది? ఇలా భూములను అమ్ముకుంటూ పోతే రేపు తెలంగాణా వచ్చాక మనకు ఎకరం భూమి కూడా వుండకుండా అవుతది.
తెలంగాణా ఆవశ్యకతను ప్రతి తెలంగాణా బిడ్డ తెలుసు కోవాలి, నైజాం పాలనా నుండి స్వేశ్చ ఎంతకాలం వుండక పొగ ఆంధ్ర పాలనా వశమైంది. నిజాం ను ఎదిరించి పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన వీరుల గడ్డ మనది, ఆంధ్ర పాలనలో ప్రత్యేక తెలంగాణా వుద్యమం లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల స్పూర్తి తో, ఇప్పుడు జరుగుతున్న అరాచకాలను ఎదురుకోవాలి. తెలంగాణా వాదం రాజకీయమై తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్నారు.. ప్రజా వుద్యమం చెయ్యాలి, ప్రతి రంగం లో మనం వెనుకపడి పోవటానికి ప్రాంతీయ అసమానతలే కారణం. విద్యారంగం లో విద్యావకాశాలు కల్పించే దానిలో అవకతకలు, పాఠశాలల , కాలేజీల , యునివెర్సిటీ ల పంపినిలల్లో అసమానతలు. అందులో పనిచేసే వుద్యోగుల కేటాయింపు లో అవకతవకలు. వేవసాయ రంగం జరుతున్న అసమానతలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి, తెలంగాణా లో నది పరివాహక ప్రాంత ఆదరంగా నీళ్ళ కేటాయింపు జరగడం లేదు, ఇర్రిగేషన్ ప్రాజెక్ట్స్ మరమ్మతుకు నోచుకోక నీటి పారుదల గతి తగ్గి పోతుంది. కొత్తగ మొదలు పెట్టిన ప్రాజెక్ట్ లకి, సరైన నీళ్ళ కేటాయింపు లేకపోగా, ఆకరి దశకు కూడా నోచుకోకుండా వున్నాయి.
అందుకే, ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినం తెలంగాణా విద్రోహదినంగ పరిగణించాలి, ఈ రోజే తెలంగాణా అభివృద్ది కి సమాధి కట్టిన రోజు, మన స్వేఛ్చ జీవితాలకు సంకెళ్ళు వేసిన రోజు. తెలంగాణా వునికి శాశ్వతం గ పూడ్చి పెట్టడానికి పూనుకున్న దినం.ఆంధ్ర ప్రదేశ్ అవతరణ తెలంగాణా ప్రజాస్టానికి అతీతంగ ఏర్పడింది, అందుకు నిరసనగా అవతరణ దినాన్ని తెలంగాణా విద్రోహదినంగ జరుపు కోవాలని తెలంగాణా బిడ్డలందరికీ మనవి.
జై తెలంగాణా!
జై జై తెలంగాణా!!

No comments: