తెలంగాణ పై చిరు కు స్పష్టత లేనట్టే.
చిరు తెలంగాణ గురించి గొప్పగా నాలుగు మాటలు మాట్లాడితే మురిసి పోతున్న సోదరులు ఇంకా అసలు విషయం తేల్చనే లేదన్నది మరిచిపోరాదు. చిరు కు తెలంగాణ విషయం లో స్పష్టత లేదు. YS & TDPలు చెప్పేదానికి & చిరు చెప్పిన దానికి తేడా ఏమీ లేదు. YS కూడా అదే అంటున్నాడు ప్రజలు కోరుకుంటే తెలంగాణ వస్తుంది. నేను అడ్డం కాదు అని. ఈయన CM కాకముందే ఇట్ల అన్నడు అంటే రేపు CM అయ్యే అవకాశం ఉంటే ఈయన ఎట్ల మాట్లాడుతడో మనం ఊహించొచ్చు. చిరంజీవి అన్న మాటలు "నీల్లు నిదులు నియామకాల్లో తెలంగాణ కు అన్యాయం జరిగిందని అక్కడి ప్రజలు భావిస్తున్నరు. వెనక బడ్డ ప్రాంతాలు ప్రతి దగ్గరా ఉన్నాయి. కోస్తాంధ్ర లో నీళ్లే కాదు కన్నీళ్లు ఉన్నయి. "(కోస్తాంధ్ర లో కష్టాలు నిజంగానే ఉన్నయట. తెలంగాణ కు అన్యాయం జరిగిందని మాత్రం అక్కడి ప్రజలు భావిస్తున్నరట.) జరిగిన అన్యాయం అంతా ఇప్పటి వరకు అధికారం లో ఉన్నవాళ్ల వల్ల జరిగింది మాత్రమె.నట. ఈయనవస్తే ఇలా జరగదని ఈయన చెప్పాలనుకుంటున్నాడు. తెలంగాణ చాలా గొప్పదని మాట్లాడిన చిరు తెలంగాణ రాష్ట్రం గురించి మాత్రం ఏదీ చెప్పలేదు. ఒకవేళ ఆ పరిస్తితే వస్తే స్నేహపుర్వకం గా విడిపోవడానికి సహకరిస్తాం అని చెప్పడం ద్వారా చిరు చెప్పదలుచుకున్నది అర్థం అవుతుంది. అంటే తప్పని సరి పరిస్తితుల్లో మాత్రమే అంగీకరిస్తాడట. మూడు పెద్ద పార్టీలు ముందుకు రాకుండా తప్పని సరి పరిస్తితులు రావడం ఎలా జరుగుతుంది..? అంటే రేపు ఎప్పుడైనా తెలంగాణ పార్టీల ఎమ్మెల్యేల అవసరం వస్తేనే ఆ అనివార్యం వచ్చినట్టా..? మరి లేకపోతే ఆ తప్పని సరి పరిస్తితి ఏమిటి..? ప్రజాభిప్రాయం కనుక అదే ఐతే ఓకే అంటున్నాడు అన్నయ్య. కాని సమస్యల్లా ప్రజాభిప్రాయం అంటే ఎవరిది. తెలంగాణ ప్రజలదా..? లేక అన్ని ప్రాంతాల వారిదా..? దెబ్బ తాకినోడు ఏడుస్తూంటే కొట్టిన వాన్ని అడిగి ట్రీట్ మెంట్ చేస్తాం అనడం కరెక్టా..? ప్రాజాభిప్రాయ సేకరణ కు చిరు ఎంచుకున్న మార్గం ఏంటి..? కేవలం ఓట్లు సీట్లేనా..? ఐతే ఎవరి సీట్లు తెలంగాణవి అన్నమాట..? కేవలం TRS, NTPP, BJP లవేనా లేకా గొడమీది పిల్లులు కాంగ్రేస్ సీపి ఐ లవి కూడానా..? పార్టీ పెడతా అని రెండు మూడు ఏళ్ల నుంచే అంటున్న చిరంజీవి తెలంగాణ పైమాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటున్నాడు. ఆయన తీసుకున్న ఒకేఒక నిర్ణయం రాజకీయాల్లోకి రావడం. సీయెం కావడం. అంతేనా..!! - Naveen Achari
No comments:
Post a Comment