తెలంగాణా ఓటరులకు విన్నపం, మీ యొక్క ఓటు ను తెలంగాణా కే వేయండి. తెలంగాణా ను గెలిపించు కొండి. ఈ ఉప ఎన్నికలు తెలంగాణా వాదానికి సమైక్య ఆంధ్రా వాదానికి మధ్య జరుగుతున్న ఒక యుద్ధం. తెలంగాణా లో ని నాలుగు కోట్ల ప్రజల చిరకాల వాంచ "తెలంగాణా రాష్ట్రం" ఏర్పాటు మీ యొక్క ఓటు మీద నే ఆధార పడి ఉంది.
తెలంగాణా వాదులార - విధ్యార్తులార, విధ్యావంతులార కళాకారులార, వ్యాపారస్తులార, కార్మికులారా, కర్షకులారా, ప్రజలారా తెలంగాణా కై అంతిమ పోరాటం మొదలయింది. తెలంగాణా సమస్య మీద అందరు మాట్లాడుతున్నారు, అన్ని రాజకీయ పార్టీలు 2009 ఎన్నికలప్పుడు తెలంగాణా కు సై అన్నాయి, అఖిలపక్ష సమావేశం లో ఒకే అన్నాయి.. తెలంగాణా పై కేంద్రం ప్రకటన వేలుపడే సరికి అన్ని రాజకీయ పార్టీల నిజస్వరుపాలు బయట పడ్డాయి. పార్టీలకు అతీతంగ ఆంధ్ర , రాయలసీమ కాంగ్రెస్, తెలుగు దేశం, ప్రజా రాజ్యం పార్టీల ఎం.ఎల్.ఏ. లు మూకుమ్మడి రాజీనామాలు చేసి తాటాకు మంటలతో ఉద్యమం చేసి, డిసెంబర్ 23 ప్రకటనతో తెలంగాణా ప్రజల ఆశల మీద నీళ్ళు చల్లేసిండ్లు. ఈ మన తెలంగాణా కు చెందిన కాంగ్రెస్, తెలుగు దేశం నాయకుల ఆంధ్ర పెట్టుబడి దారులకు, ఆంధ్ర నాయకత్వానికి అమ్ముడు పోయి, తెలంగాణా జే.ఏ.సి. నిర్ణయానికి కట్టుబడి ఉండక, రాజీనామా చెయ్యక పోగా ఉపఎన్నికల్లో పోటీ కి దిగుతున్నారు, దీన్ని ఏమంటారు మీరే ఆలోచించుకోండి, వాళ్లకి కావలిసింది పదవులు, అధికారం మాత్రమే తెలంగాణా ఎడ పోతే ఏంటి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పోటి చేసి గెలిచి ఎం నిరుపిద్దాం అనుకుంటున్నారు?.. తెలంగాణా వాదం లేనే లేదు, తెలంగాణా ప్రజలు సమైక్యాంద్ర నే కోరుకుంటున్నారు అనే అబద్ధపు సంకేంతాలు కేంద్రానికీ, శ్రీ కృష్ణ కమిటి కి పంపెందుకేన మీ కుట్ర?.
ఓటు అడిగే, కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులను నిలదీసి అడగండి, తెలంగాణా కొరకు రాజీనామా చెయ్యని వారు ఏ మొకం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు అని. శ్రీ కృష్ణ కమిటి కి తెలంగాణా కోసం ఏక వాక్య నివేదిక ఇవ్వకుండా మూడు మూడు నివేదికలు ఇచ్చిన చంద్ర బాబు ని, అయిన పార్టి నాయకులను అడగండి, తెలంగాణా ఎట్లా తెస్తారో? అని. అదే శ్రీకృష్ణ కమిటికి తను వంతు బాధ్యతగ ఒక్క నివేదిక ఇవ్వని డి.ఎస్. ని నీలదీసి అడగండి, తెలంగాణా ఎట్లా తెస్తారో అని.
ఉప ఎన్నికలు రాంగానే తెలంగాణా వాదాన్ని కూడా లెక్క చెయ్యకుండా ఎన్నికల్లో కి నోట్ల కట్టలతో పోటికి వస్తున్నా కాంగ్రెస్, తెలుగు దేశం అభ్యర్తుల డిపాజిట్లు గల్లంతు అయ్యేటట్టు మీ ఓటు ను తెలంగాణా కు వెయ్యండి, తెలంగాణా కై పదవులను త్యాగం చేసిన అభ్యతులనే గెలిపియ్యండి. ఇదే ఆకరు మోక, మన వాళ్ళలో ఒక్కరు ఓడిపోయినా సీమాంధ్రులు మన తెలంగాణా వాదాన్ని అవహేళన చేస్తారు, తెలంగాణా కై ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను అవమాన పరిచి, వారి త్యాగాలు వృధా పరుస్తార? అందుకే మీ యొక్క ఓటు బలాన్ని చూపి కేంద్రానికి, శ్రీ కృష్ణ కమిటి కి గుభ గుయ్యిమనేట్టు సమాధానం చెప్పుతార? ఆలోచించుకోండి.
ఆంధ్ర వలస పాలనలో తెలంగాణా 53 సంవస్తరాల నుండి దగ పడుతుంది, బాష యాసల మీద పెత్తనం, సంస్కృతీ మీద దోపిడీ, వనరుల దోపిడీ, నీటి పంపకాలల్లో, విద్య అవకాశాల్లో అసమానత, ఉద్యోగాలను తెలంగాణా వాళ్ళకు కాకుండా తన్నుక పోవటం. చదువుకున్నా సరైన ఉపాధి దొరకని ఈ పాలనా లో ఇంకా ఎన్ని నాళ్ళు మోసపోతు వుంటాం, ఇదే మన తల రాత అనుకుంటూ ఆంధ్ర వలస లో మగ్గి వున్న్దామా? తేల్చుకోండి. 1956 తర్వాత తెలంగాణా ప్రజలకు జరిగిన న్యాయం లేదు- జరగని అన్యాయం లేదు. ఈడ భుములేమో బీడు పోతుంటే పచ్చని పంట పొలాలు ఆంధ్ర లో, ప్రాజెక్ట్ లేమో ఇక్కడ నీరు పారేది అక్కడ, బొగ్గు పుట్టేది మన తెలంగాణా గర్బం లో దానికి సంబంధించిన పరిశ్రమలు ఆంధ్ర లో, మిగులు బడ్జెట్ ఇక్కడిది - తరలిమ్పులేమో ఆంధ్రా కు. ఈ ఆంధ్ర పాలనా లో విద్యారంగం అభివృద్ధి చెందినదా? లేదు, ప్రభుత్వ పాటశాలలు కాని, కళాశాలలు కాని, పోలిటేకినిక్ కళాశాలలు కానీ, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు కాని, యునివేర్సిటీస్ కాని జనాభా ప్రాతిపదికన ఏర్పాటు జరగా లేదు.
మన ఉద్యోగాలు మనకు దక్కినాయ, లేవు.. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రబుత్వ ఉద్యోగాల సంఖ్య 15 లక్షలు అందులో తెలంగాణా వాటా 42 శాతం అంటే, 6 లక్షలు కాని మనకు దక్కినవి కేవలం 20 శాతం అంటే, మిగతావి దొంగ నివాస పత్రాలతో మన ఉద్యోగాలు తన్నుక పోయిండ్లు.ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ లో 5000 మంది ఉద్యోగుల్లో మన వాళ్ళు కేవలం 13 శాతం మాత్రమే, నాన్ లోకల్ నియామక రద్దుకు 1985 లో చేసిన జి.వో. 610 మాత్రం 25 సంవస్తరాల నుండి అమలుకు నోచుకోలేదు. ఇంకెన్ని నాళ్ళు ఈ ఆగడాలు, ఇక సాగనివ్వం మీ ఆటలు, ఈ ద్వంద వైకరితో వేవహరించే కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలకు భుద్ధి చెప్పండి.
అప్పటి ఆంధ్ర వాళ్ళు చేసిన జై ఆంధ్ర ఉద్యమం లో కాని, ఇప్పటి సమైక్యాంధ్ర ఉద్యమం లో కాని ఒక్కరు చనిపోయినట్టు దాకలు కాని, ఏ చిన్న లాటి చార్జి కాని, ఏ ఒక్కరు మీద అయిన కేసు పెట్టి, అర్రెస్ట్ చేసిన వైనం లేదు. అదే అప్పటి మన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం (1969 నుండి 1972 ) లో 369 మంది ఉద్యమ కారులను ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ గవర్నమెంట్ పొట్టన పెట్టుకున్నది, ఇప్పటికి జరుగు తున్న ఉద్యమం లో ఎన్నో లాటి చార్జీలు, విద్యార్థుల మీద వెయ్యిల కొద్ది కేసులు, జైలు నిర్బందాలు, ౩౦౦ పైగా భాలిదానాలు. ఇవ్వన్ని తెలంగాణా ప్రజలు అంత తొందరగా మర్చి పోలేదు అని, ఈ ఎన్నికల అవకాశాన్ని తెలంగాణా వాదాన్ని నిరుపించేద్దుకే సిద్దంకావాలని కోరుతున్నాం.
తెలంగాణా జే.ఏ.సి. తీర్పుకు కట్టుబడి, తెలంగాణా సాధన కోసం పదవులను త్యాగం చేసిన తెలంగాణా రాష్ట్ర సమితి, జే.ఏ.సి అభ్యర్తులకే తమ వోటు ను వేయాలని కోరుతూ.
జై తెలంగాణా.. జై జై తెలంగాణా... జై జై జై తెలంగాణా....
No comments:
Post a Comment