Tuesday, July 23, 2013

తెలంగాణ చారిత్రకంగానే పారిశ్రామిక రంగం లో వెనకబడి ఉంది.

“తెలంగాణ చారిత్రకంగానే పారిశ్రామిక రంగం లో వెనకబడి ఉంది.” 1956 నవంబరు ఒకటి నుండి హైదరాబాదు ఆ రంగం ఈ రంగం అన్ని రంగాలలో వెనకబడి ఉంది అని తెలంగాణ ‘రంగ’స్థలం మీద ప్రతి రోజు ‘నిజం — it’s a lie’ అన్న నాటకం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్దనేదే నిజమైన నిజం. ఫలితంగా తెలంగాణ ఆత్మనున్యతా భావంలోకి తనకు తెలియకుండానే నెట్టివేయ బడింది. “హైదరాబాదు సంస్థానం లో పారిశ్రామికీకరణ” అన్న పరిశోధనా పత్రంలో (సి. వి. సుబ్బారావు, డిల్లీ విశ్వ విద్యాలయంలో ఆర్ధిక శాస్త్ర నిపుణులు) 1930 లోనే తెలంగాణలో పారిశ్రామిక పురోగతి ఎలా జరిగింది (కోస్తాంధ్ర, రాయలసీమలో ఎలాంటి ఫ్యాక్టరీలు లేనప్పుడే సుమారు 200 ఫ్యాక్టరీలు తెలంగాణ జిల్లాల్లో ఉండేవి) వివరించారు. ఒక వేళ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశంలోకి రాకపోతే ఈ దేశంలోని చేనేత పరిశ్రమ బ్రిటన్లోని చేనేత పరిశ్రమల కన్నా అభివృద్ధి చెందేదని కారల్ మార్క్స్ చెప్పినట్లు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో విలీనం కాకపోతే తెలంగాణాలోని పరిశ్రమలన్నీ ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేవన్నది నగ్న సత్యం. నిజాం కాలంలో తెలంగాణలో పారిశ్రామిక పురోగతి 1871 సింగరేణి బొగ్గు గనులు 1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు 1876 ఫిరంగుల ఫ్యాక్టరి 1910 ప్రభుత్వ ప్రింటింగు ప్రెస్ 1910 ఐరన్ ఫ్యాక్టరి 1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరి 1919 వి.ఎస్.టి. ఫ్యాక్టరి 1921 కెమికల్ లాబొరేటరి 1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరి 1929 డి. బి. ఆర్. మిల్ల్స్ 1931 ఆజంజాహి మిల్ల్స్, వరంగల్ 1932 ఆర్. టి. సి. స్థాపన 1937 నిజాం షుగర్ ఫ్యాక్టరి 1939 సిర్పూర్ పేపర్ మిల్ 1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరి 1942 హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ 1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్ 1943 ప్రాగా టూల్స్ 1946 హైదరాబాద్ ఆస్బెస్టాస్ 1947 హైదరాబాద్ లామినేషన్ ప్రోడక్స్

No comments: